యువత సన్మార్గంలో నడవాలి: అదనపు కలెక్టర్
యువత సన్మార్గంలో నడుస్తూ. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సోమవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, డిసిపి వైభవ్ గైక్వాడ్ లు పెద్దపల్లి అమర్ చంద్ కళ్యాణ మండపం నుండి నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మిషన్ పరివర్తన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ పిల్లల అలవాట్లపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, చెడు మార్గంలో వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు.
డిసిపి వైభవ్ గైక్వాడ్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత బాంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని తెలిపారు. అనంతరం మాదకద్రవ్యాల నివారణ, డ్రగ్స్ నివారణ కోసం రూపొందించిన పోస్టర్లను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ స్వప్న, డి అడిక్షన్ సెంటర్ ప్రకృతి ఎన్జిఓ ఇంచార్జీ రమాదేవి, కౌన్సిలర్ చారీ, పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.