ఎన్టీపీసీలో ప్రమాదం… కాంట్రాక్ట్ కార్మికుడికి తీవ్ర గాయాలు
రామగుండం ఎన్టిపిసి విద్యుత్తు ప్లాంట్ 5వ యూనిట్ ఈ. ఎస్. పి ఏరియా లో సోమవారం ప్రమాదవశాత్తు ఎలక్ట్రికల్ ఫ్లాష్ ఓవర్ కావడంతో శ్రీనివాస్ అనే కాంట్రాక్టు కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఎన్టిపిసి ధన్వంతరి ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించారు. అనంతరం హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తున్నట్లు సమాచారం.