పొన్నం Vs గంగుల..
మంత్రి గంగులపై కోర్టుకెక్కిన పొన్నం
మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. 2018 ఎన్నికల్లో గంగుల పరిమితికి మించి ఖర్చు చేశారని పొన్నం హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈసీని ఆదేశించాలని కోర్టును కోరారు. ఇన్నేళ్లయ్యాక పత్రాలు ఈసీ ఇవ్వాలి అనడం అభ్యంతరమని గంగుల వాదించారు. ఈ మేరకు గంగుల వాదనను తోసిపుచ్చిన కోర్టు.. ఈ పిటిషన్ పై విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది.