మద్దతు దొరికేనా… ?? సీఎం కేసీఆర్‌తో ముగిసిన అసదుద్దీన్ భేటీ
హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు తెలంగాణ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. సీఎంతో అనేక అంశాలను చర్చిస్తూ ఉమ్మడి పౌర స్మృతి (UCC)ని వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. ‘యూసీసీ వల్ల హిందూ వివాహ చట్టమూ రద్దు అవుతుంది. యూసీసీకి వ్యతిరేకంగా అన్ని పార్టీల మద్దతు కూడగడతాం’ అని అన్నారు.