కాంగ్రెస్ ది రైతు వ్యతిరేక విధానం
రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు రద్దు చేయాలన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు మండి పడ్డారు.
కరీంనగర్ భారత రాష్ట్ర సమితి నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్ఆధ్వర్యంలో..పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై కరీంనగర్ బిఅరెస్ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేసారు..తెలంగాణ చౌక్ లో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని స్తంభానికి ఉరి వేసి నిరసన వ్యక్తం చేసారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి గంగుల కమలాకర్ .. నగర మేయర్ యాదగిరి సునీల్ రావు.. ముఖ్యఅతిథిగా హాజరైనారు…బిఅరెస్ శ్రేణులు భారీగా పాల్గొని ..కాంగ్రెస్ కి వ్యతిరేకంగా..పెద్ద ఎత్తున నినాదాలు చేశారు
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ పీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడిన మాటలు అన్ని చంద్రబాబు మాట్లాడించినవే నని అన్నారు..చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులే నని.. మరోసారి తెలంగాణ పై ఇంకా విద్వేషాన్ని చూపిస్తున్నారు.. గతంలో మూడు గంటల కరెంట్ కాంగ్రెస్ ఇచ్చినప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేసారు..కాంగ్రెస్ అధికారం లోకి వస్తే రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తామని చెప్పకనే చెబుతున్నారని ఏద్దేవా చేసారు..అలాంటి కాంగ్రెస్ కి మూడు సీట్లు మాత్రమే ఇవ్వాలని రైతులను కోరారు..తెలంగాణ వచ్చినాక రైతుల ఆత్మహత్యలు తగ్గాయని..పక్కరాష్ట్రాలకు తెలంగాణ కరెంట్ తరలించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నదని అన్నారు .అలాంటి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ లో గుడ్డి దీపాలే దిక్కు అవుతాయని ఆవేదన వ్యక్తం చేసారు ..కాంగ్రెస్ పాలించే కర్ణాటక లో తిండి కి లేక తెలంగాణ రాష్ట్రాన్ని బియ్యం అడిగారని..కర్ణాటక లో కరెంట్ కూడా సరిపడా ఇవ్వడం లేదని వెల్లడించారు .
తెలంగాణ రైతంగంపై కాంగ్రెస్ కక్ష కట్టింది.
ఓవైపు బీజేపీ వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని అంటుంటే…మరోవైపు కాంగ్రెస్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వద్దు అని రైతుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు…70 ఏళ్ల పాలనలో రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదగాలని 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందని అన్నారు…కాంగ్రెస్ పాలనలో అప్పుల బాధతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి ఉందని . ఇప్పుడు స్వరాష్ట్రంలో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారని గుర్తు చేసారు…..మొదటి నుంచి కాంగ్రెస్‌కు రైతులంటే చిన్నచూపే, మొన్న ధరణి వద్దన్నారు, ఇప్పుడు వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందని అంటున్నారని అన్నారు .తెలంగాణలో పచ్చదనం చూసి రేవంత్ రెడ్డి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండి పడ్డారు
దేశానికి వెన్నెముక అయిన రైతును రాజు చేయాలని సీఎం కేసిఆర్ రైతుల కోసం మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా రైతు సంక్షేమం కోసం 30 వరకు పథకాలను అమలు చేస్తున్నారన్నారు…రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం, మిషన్ కాకతీయ ఇలా పలు రకాల రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ దేశానికి రోల్‌మాడల్‌గా నిలిచిందని అన్నారు..
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు నగర మేయర్ యాదగిరి సునీల్ రావు.. కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు..వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు.. గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్.. కరీంనగర్, దూర్షెడ్ ఫ్యాక్స్ చైర్మన్ లు శ్యాంసుందర్ రెడ్డి.. గొనె నర్సయ్య తిప్పర్తి లక్ష్మయ్య పిల్లి శ్రీలత మహేష్ గౌడ్.. టిఆర్ఎస్ యూత్ నగర అధ్యక్షులు కుల్దీప్ వర్మ,,మంద రాజమల్లు కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.