రామగుండం మెడికల్ కాలేజ్ ‘సిమ్స్’ గా మార్పు…!
రామగుండం మెడికల్ కళాశాలకు సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్ )గా నామకరణం. సింగరేణి కార్మిక పిల్లలకు వైద్య కళాశాలో చేరేందుకు 5శాతం కోటాను కేటాయించిన సందర్భంగా మంగళవారం ప్రగతిభవన్ లో మంత్రి కే. టి రామారావు ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రామగుండం కార్పొరేషన్ కు 100కోట్ల నిధులు త్వరగా విడుదల చేయాలని కేటిఆర్ ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు.