ఐదుగురిని కొట్టి చంపిన మావోలు
జార్ఖండ్ లోని లతేహార్ జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నక్సలైట్స్ బీభత్సం సృష్టించారు. నెటార్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఇన్ ఫార్మర్లనే నెపంతో ఐదుగురిని ఇళ్ల నుంచి తీసుకెళ్లారు. అనంతరం వారిని తీవ్రంగా కొట్టి చంపారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మావోలను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు.