భారీ వర్షాలు.. సెలవులు పొడగింపు
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ, రేపు ఇప్పటికే సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎల్లుండి కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. అంతే కాకుండా జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.