రేపు తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు దీనిని అమలు చేయాలని సూచించింది.