వసంత్ మృతి బాధాకరం: పవన్ కళ్యాణ్
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పొందూరులో విద్యుత్ షాక్ తో జనసేన నేత వసంతకుమార్ మరణించడంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘కరెంట్ తీగలు వేలాడుతున్నాయని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దామనే క్రమంలో విద్యుత్ షాక్ తగిలింది. వసంతకుమార్ కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నా. కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందిస్తాం’ పవన్ అని పేర్కొన్నారు.