‘ట్విట్టర్ లోగో ఎందుకు మార్చామంటే?’
ట్విట్టర్ పేరు, లోగోను మార్చడంపై ఎట్టకేలకు ఎలాన్ మస్క్ వివరణ ఇచ్చారు. ట్విట్టర్ ను ఇకపై సూపర్ యాప్ గా మార్చాలని భావిస్తున్నానని, ఈ ఉద్దేశంతోనే పేరు, లోగో మార్పు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వ్యాపార కమ్యూనికేషన్, ఆర్థిక ట్రాన్సాక్షన్స్ సహా విస్తృత ప్లాట్ ఫామ్ గా దీన్ని మార్చాలనుకుంటున్నట్లు చెప్పారు. వాక్ స్వాతంత్రానికి గుర్తుగా ట్విట్టర్ ను మార్చాలని ఎక్స్ కార్పొరేషన్ కొనుగోలు చేసిందని, అందుకే పేరు మార్చామన్నారు.