ఆ BRS ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదన్న హైకోర్టు
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించింది. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు వివరాలు సమర్పించారని, ఆయన ఎన్నిక చెల్లదని కోర్టు ప్రకటించింది. వనమా గెలుపును సవాల్ చేస్తూ జలగం 2018లో కోర్టును ఆశ్రయించాడు. విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పునిచ్చింది. వనమాకు రూ.5 లక్షల జరిమానా విధించింది. 2018 నుంచి ఇప్పటి వరకు వనమా ఎమ్మెల్యే కాదని కోర్టు తీర్పునిచ్చింది.