ఫీజు రీయింబర్స్‌మెంట్ పై మంత్రి గంగుల సంచలన ప్రకటన
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించిన బీసీ విద్యార్థుకు ఈ విద్యా సంవత్సరం నుంచే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గతంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఈ అవకాశం ఉండగా.. ఈ ఏడాది నుంచి బీసీ విద్యార్థులకు వర్తించనుంది. దీంతో రాష్ట్రంలో దాదాపు 10వేల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా అదనంగా రూ. 150 కోట్లను వెచ్చించనుంది.