సమస్యాత్మక ప్రాంతాలను సందర్శించిన కార్పొరేటర్ పిట్టల వినోదశ్రీనివాస్
కరీంనగర్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మరియు వాతావరణ సూచనా మేరకు రానున్న 48గంటలు భారీ వర్ష సూచన ఉన్నందున.. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని 45డివిజన్ కార్పొరేటర్ పిట్టల వినోద శ్రీనివాస్ ప్రజలను కోరారు… ఈరోజు ఉదయం సమస్యతాక ప్రాంతాల్లో సందర్చిన కార్పొరేటర్ పిట్టల వినోద శ్రీనివాస్ రోడ్డుపైన నిలిచిన నీటిని, చెత్తను మున్సిపల్ సిబ్బందిని సహకారంతో వెంటనే శుభ్రం చేయించారు. ప్రజలు ఇంటి వద్ద నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని డివిజన్ ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జవాన్ ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.