ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలు
దేశంలో టమాటా ధరలు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో కేజీ టమాటా ధర రూ. 200 పలుకుతోంది. దీంతో టమాటా కొనలాంటేనే సామాన్యులు జంకుతున్నారు. మరోవైపు తిరుపతి జిల్లా గూడూరు మార్కెట్లో కేజీ టమాటా రూ. 200 నుండి రూ. 220 వరకు పలికింది. కాగా, ప్రతికూల పరిస్థితుల వల్ల పంట దిగుబడి తగ్గడంతో డిమాండ్ పెరిగి రేట్లు విపరీతంగా పెగురుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.