ట్రాఫిక్ ఏసిపి గా సర్వర్ బాధ్యతల స్వీకరణ
కరీంనగర్ జిల్లా సోమవారం కరీంనగర్ ట్రాఫిక్ విభాగం ఏసిపి గా సర్వర్ బాధ్యతలను చేపట్టారు. 1995 బ్యాచ్ కు చెందిన ఆయన కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాలో పనిచేశారు. ట్రాఫిక్ ఏసీపి గా బాధ్యతలు స్వీకరించిన, అనంతరం ఆయన పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు.