ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జిగా బండి సంజయ్?
బీజేపీ ఏపీ ఇన్‌ఛార్జిగా ఎంపీ బండి సంజయ్‌ను నియమించేందుకు ఆ పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఆయనను ఇటీవలే తొలగించారు. తర్వాత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో నియమించారు. తెలంగాణలో స్తబ్ధుగా ఉన్న బీజేపీకి జవసత్వాలు తెచ్చిన వ్యక్తిగా క్యాడర్‌లో ఆయనకు పేరుంది. దీంతో ఏపీలో పార్టీ బలోపేతం కోసం ఆయనను రాష్ట్ర ఇన్‌ఛార్జిగా నియమిస్తారని ప్రచారం సాగుతోంది.