లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిద్ధం: కేటీఆర్
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ వస్తుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. హస్తినాపురంలో లబ్ధిదారులకు కేటీఆర్ కన్వీనియన్స్ డీడ్ పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరని అన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఆగస్టు 15 నుంచి అక్టోబర్ లోగా నియోజకవర్గానికి 4వేల ఇళ్లు పంపిణీ చేయాలని ఆదేశించారు.