ఇసుక లారీ ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు
ఇసుక లారీ ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు అయినా సంఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో చోటు చేసుకుంది. మంథని మండలం వెంకటాపూర్ గ్రామంలో నివసించే గూడ భూమక్క (70) అనే వృద్ధురాలు రోడ్డుపై నుండి వారి బంధువుల ఇంటికి వెళ్తున్న క్రమంలో వెంకటాపూర్ వెళ్తున్న ఇసుక లారీ ఢీ కొంది. ఆమె రెండు కాళ్లపై నుండి లారీ వెళ్లడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. భూమక్కను చికిత్స నిమిత్తం మంథని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
11030123. ఇసుక లారీ ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు