మీది నుంచి ట్రాక్టర్ వెళ్లినా బతికాడు(వీడియో)
ఓ వ్యక్తి మీద నుంచి ట్రాక్టర్ వెళ్లినా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన బుధవారం ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెంలోని పెట్రోల్ బంక్‌లో జరిగింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలోని పెద్దాపురం గ్రామానికి చెందిన కృష్ణా రెడ్డి తన ట్రాక్టర్‌లో డీజిల్ కొట్టించేందుకు ఇక్కడకు వచ్చాడు. అయితే ప్రమాదవశాత్తూ గేర్ పడి ట్రాక్టర్ ముందుకు కదిలింది. ట్రాక్టర్‌ను ఆపే ప్రయత్నంలో అతడు ట్రాక్టర్ కింద పడ్డాడు. ఈ క్రమంలో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.