అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
అకాల వర్షాలు వరదలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆదుకొని 30 వేల నష్టపరిహారం చెల్లించాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భామండ్లపల్లి యుగేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం శంకరపట్నం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యుగేందర్ మాట్లాడుతూ. జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు, వరదలు రావడం వల్ల రైతులు వేసిన పత్తి, వరి ఇతర పంటలు మునిగిపోయి వేలాది ఎకరాల్లో పంట తీవ్ర నష్టం జరిగిందన్నారు.