అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ తాండకు చెందిన హరి నాయక్ బుధవారం అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు ఆరు నెలల నుండి రాయికల్ కు చెందిన ఇసాక్ వద్ద పని చేస్తున్నాడు. ఇసాక్, రాజేందర్ కలిసి హరి నాయక్ మృతదేహాన్ని మోటార్ సైకిల్ పై బుధవారం వాల్గొండ తండాకు తీసుకొని వచ్చి హార్ట్ ఎటాక్ తో మృతి చెందాడని ఇంటి వద్ద వదిలి వెళ్ళిపోయారు. ఇతని మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.