వేగంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు
కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు వరంగల్తో పోల్చితే ఎంతో వేగంగా జరుగుతున్నాయని స్మార్ట్ సిటీ వర్క్స్ మేనేజింగ్ రిప్రజెంటేటీవ్ ఆఫీసర్ సూర్య అన్నారు. కరీనగర్ బల్దియా హెడ్ ఆఫీసులో శుక్రవారం స్మార్ట్ సిటీ పనులపై రివ్యూ మీటింగ్ జరగ్గా, మేయర్ సునీల్ రావుతో కలిసి సూర్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, 49 స్మార్ట్ సిటీ పనుల్లో 90% పూర్తయ్యాయన్నారు. మిగిలినవి డిసెంబర్ 31లోపు పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు.