ఆర్టీసీ విలీన బిల్లు పెండింగ్
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేసేందుకు వీలు కల్పించే ఆర్టీసీ విలీన ముసాయిదా బిల్లును తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పెండింగ్ పెట్టారు. దీనిపై న్యాయసలహా తీసుకోన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని శుక్రవారం రాజ్‌భవన్ ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై కార్మికులు భగ్గుమంటున్నారు. బిల్లును ఆమోందించకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ప్రకటించారు. ఈ ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే బిల్లుకు ఇటీవలే రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.