డెలివరీ బాయ్‌గా మారిన జొమాటో సీఈవో
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈవో దీపీందర్ గోయల్ ఫ్రెండ్‌షిప్ డేను వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. స్పెషల్ డే సందర్భంగా గోయల్ కస్టమర్లు, ఎగ్జిక్యూటివ్‌లకు స్వయంగా తానే ఫుడ్ డెలివరీ చేశారు. డెలివరీ పార్ట్‌నర్లు, రెస్టారెంట్ పార్ట్‌నర్లు, కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేయడంతో పాటు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లను పంపిణీ చేశారు. ఈ ఫొటోలను జొమాటో సీఈవో ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.