పద్మశాలి యుద్ధ భేరికి ఏర్పాట్లు పూర్తి
కోరుట్ల పట్టణంలో ఆదివారం పద్మశాలి యుద్ధ భేరి ఛలో కోరుట్ల నిర్వహిస్తున్నామని కార్యక్రమ బాధ్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేరళ రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష, కర్ణాటక ఎంపి నారాయణ, కర్నూలు ఎంపి సంజీవ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీలు అనురాధ, వేంకటేశ్వర రావు, మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి, తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర కన్వీనర్ రామా శ్రీనివాస్ పాల్గొననున్నారన్నారు.