ఇండియాలో 23 లక్షల ట్విట్టర్ అకౌంట్లు బ్లాక్
నిబంధనలను ఉల్లంఘించిన యూజర్లపై ట్విట్టర్ (ప్రస్తుత X) కఠిన చర్యలు తీసుకుంది. జూన్-జులై నెలల్లో రికార్డు స్థాయిలో 23,95,495 ఖాతాలను బ్లాక్ చేసినట్లు తాజాగా ట్విట్టర్ వెల్లడించింది. చిన్నారులపై లైంగిక దోపిడీ, అశ్లీలతను ప్రోత్సహించేలా పోస్టులు చేసిన ఖాతాలే ఇందులో ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. కాగా అంతకుముందు మే 26 నుంచి జూన్ 25 మధ్య నెల రోజుల వ్యవధిలో 5,44,473 ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే.