Print Friendly, PDF & Email

తిరుమల నడక మార్గంలో హై అలర్ట్ జోన్..

తిరుమలలో అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో మృతి చెందిన బాలిక ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. ఈ క్రమంలో తిరుమల నడక మార్గంలో హై అలర్ట్‌ జోన్‌ను ప్రకటించింది.

TTD High Alert: తిరుమల నడక మార్గంలో హై అలర్ట్ జోన్..

భక్తులకు భద్రతా సిబ్బంది పర్యవేక్షణను టీటీడీ తప్పనిసరి చేసింది. అయితే, తిరమలకు వచ్చే భక్తుల భద్రతపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్‌ జోన్ గా ప్రకటించింది. అక్కడ 100 మంది భక్తుల గుంపుని మాత్రమే అనుమాతించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Viral video:ఇదేందయ్యా ఇది.బోగీల్లో కరెంటు లేదని టీటీఈని టాయిలెట్‌లో బంధించిన ప్రయాణికులు!

భక్తులకు మందువైపు, వెనుకవైపు రోప్‌లను టీటీడీ అధికారులు ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు పైలట్‌గా సెక్యూరిటీ సిబ్బందిని నియమించనున్నారు. 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు పటిష్టమైన భద్రతను అధికారులు ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి బాధాకరమని అన్నారు. అలిపిరిలో చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. నడకమార్గంలో ప్రతీ 40 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నాడు.

Boys Hostel : తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్ ‘హాస్టల్‌ హుడుగురు బేకాగిద్దరే’

అయితే, బాధిత కుటుంబానికి టీటీడీ అండగా ఉంటుందని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. టీటీడీ నుంచి రూ.5లక్షలు, అటవీ శాఖ నుంచి రూ.5లక్షలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. నడక మార్గం వైపు చిరుతలు రాకుండా ఫారెస్ట్ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents