మంత్రి గంగుల ఇంటి ముట్టడి
కెసిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను, ప్రకటించిన సంక్షేమ పథకాలను, ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, 2014, 2019 ఎన్నికల సందర్భంగా ప్రకటించిన పథకాల ను నేటికీ సక్రమంగా అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో కెసిఆర్ సర్కార్ ఉందని , బూటకపు మాటలతో , మాయమాటలతో ప్రజానీకాన్ని మభ్యపెడుతూ గోసపెడుతున్న కెసిఆర్ సర్కార్ కి” ఎక్స్పైరీ డేట్ “వచ్చిందని , రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ ను తరిమి కొట్టడానికి తరిమి కొట్టాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగా డి కృష్ణారెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ గత ఎన్నికల సందర్భంగా ప్రకటించిన వివిధ సంక్షేమ పథకాలు, డబల్ బెడ్ రూమ్ ఇల్లులు , దళిత ,బీసీ బందు, నిరుద్యోగ భృతి , వివిధ రకాల పింఛన్లు, రేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల ను నిరసిస్తూ కరీంనగర్ జిల్లా బిజెపి నేతలు గురువారం మంత్రి గంగుల కమలాకర్ ఇంటిముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు.
మంత్రి గంగుల ఇంటి వైపు చొచ్చుక వెళ్లడానికి ప్రయత్నించిన బిజెపి నేతలు కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. తదనంతరం ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడంతో మంత్రి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ముందస్తుగా జిల్లా వ్యాప్తంగా బిజెపి శ్రేణులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం బిజెపి నేతలందరినీ కరీంనగర్ పిటిసికి తరలించారు. అరెస్టు అనంతరం జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతున్న పార్టీలను , ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. అక్రమ అరెస్టులు , నిర్బంధాలతో పోలీసుల రాజ్యాన్ని నడిపిస్తుందన్నారు. తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు , ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కెసిఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ముఖ్యంగా డబల్ బెడ్ రూమ్ ఇల్లులు, వివిధ రకాల పింఛన్లు, రేషన్ కార్డులు, దళిత బంధు , నిరుద్యోగ భృతి లాంటి హామీలను అమలు చేయడంలో కెసిఆర్ సర్కార్ అట్టర్ ప్లాప్ అయిందన్నారు. ముఖ్యంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అర్హులైన ప్రజలు ఎంతోమంది ఉన్నా నేటికీ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించిన దాఖలాలు లేవన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ , మంత్రి గంగుల వైఫల్యం అన్నారు.
మళ్లీ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అనేక మోసపూరితప్రకటనలు చేస్తున్నారనీ, .
బీసీబంధు, మైనారిటీ బంధు, గిరిజన బంధు , గృహలక్ష్మి లాంటివి ప్రకటించి ప్రజల్ని మళ్లీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లోగోడ ప్రకటించిన పథకాలకే దిక్కు లేదు కానీ. , మళ్లీ కొత్త పథకాలతో ప్రజలను మోసం చేయాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. ,నియోజకవర్గంలో ఎన్నికల హామీలు , సంక్షేమ పథకాలు అమలు చేయించాల్సిన బాధ్యత మంత్రి గంగుల కమలాకర్ పైనే ఉందన్నారు.మూడు పర్యాయాలు కరీంనగర్ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా గంగుల కమలాకర్ చేసింది ఏమీ లేదన్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు కూడా మంత్రి గంగులను ఇంటికి సాగడంపడానికి నిశ్చయించుకున్నారన్నారు. రాష్ట్రంలోని బిఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యమంత్రికెసిఆర్ మాటలకు చేతలకు పొంతన ఉండదని, మోసపూరిత బి ఆర్ ఎస్ విధానాల కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరడమే తప్పు అనే విధంగా బిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, మంత్రి గంగుల ఇంటి ముట్టడి కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పట్ల పోలీసులు అతిగా వ్యవహరించారని, పలువురు నాయకులకు కార్యకర్తలు గాయాల పాలయ్యారని, పోలీసుల వ్యవహార శైలిని బిజెపి జిల్లా శాఖ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బిజెపి శ్రేణులు అందరికీ ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్, ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ కళ్లెం వాసుదేవ రెడ్డి, భాస సత్యనారాయణరావు, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, మాడ వెంకట్ రెడ్డి, రాపర్తి ప్రసాద్, కటకం లోకేష్, దుబాల శ్రీనివాస్ ,బొంతల కళ్యాణ్, ఊగిలే సుధాకర్ పటేల్, ఎడమ సత్యనారాయణ రెడ్డి,పెద్దపల్లిజితేందర్, జాడి బాల్రెడ్డి, బల్బీర్ సింగ్, మంథని కిరణ్, నరేడ్ల ప్రవీణ్ రెడ్డి, ఎండి పర్వేజ్ ,నాగసముద్రం ప్రవీణ్, ఆవుదుర్తిశ్రీనివాస్ , నరహరి లక్ష్మారెడ్డి, మాడిశెట్టి సంతోష్, కడార్ల రతన్, బత్తిని ప్రశాంత్, ఉప్పరపల్లి శీను, ఎడవెల్లి శశిధర్ రెడ్డి, సంపత్, ఈసం పెళ్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.