చిక్కుల్లో ‘బైజూస్’.. రాజీనామా చేస్తున్న ఉద్యోగులు
ప్రముఖ ఎడ్-టెక్ స్టార్టప్ బైజూస్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పని చేస్తున్న ప్రత్యూష అగర్వాల్ రాజీనామా చేశారు. ఆమెతోపాటు మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు సంస్థను వీడారు. ఈ విషయాన్ని బైజూస్ అధికార ప్రతినిధి మంగళవారం తెలిపారు. అలాగే కంపెనీలో రెండు విభాగాల బిజినెస్ హెడ్‌లుగా వ్యవహరిస్తున్న హిమాన్షు బజాజ్, ముకుత్ దీపక్ కూడా సంస్థను రాజీనామా చేశారని తెలిపారు.