కూతురు పెళ్లిలో గుండెపోటుతో తండ్రి మృతి
తెలంగాణలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్పూర్ గ్రామంలో కుమార్తె వివాహం రోజే తండ్రి గుండె పోటుతో మృతి చెందాడు. ఇవాళ స్థానిక ఆలయంలో వివాహ ఏర్పాట్లు చేస్తుండగా రాములు ఛాతిలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.