Bigg Boss 7: ఈ సారి బిగ్ బాస్ మామూలుగా ఉండదు.. ఉల్టా పుల్టా థిమ్‌తో సరికొత్త ట్విస్టులు
తెలుగు ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో ఆదివారం రాత్రి 7.00 PM గంటలకు అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే ఈసారి బిగ్ బాస్ షో గత ఏడాది కంటే ప్రత్యేకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఎప్పుడు కూడా ఈ షోపై కాంట్రవర్సీలు జరుగుతునే ఉంటాయి. అయినా కూడా ఈ షో రన్ అవుతూ ఉంటుంది. ఈసారి బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున మరో కొత్త లుక్‌లో కనిపించారు. ఇక ఈ షో ఫస్ట్‌ఎడిసోడ్ గెస్టులుగా విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించనున్నారు. నటుడు శివాజీ, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, ఆట సందీప్, మోడల్ ప్రిన్స్.. ఇలా తదితరులు హౌస్‌లోకి వచ్చేశారు. అయితే ఇది ఉల్టా పుల్టా సీజన్ కావడం వల్ల ఎవరూ ఊహించని విధంగా ఆటలు ఉండనున్నాయి. ఇక ఈసారి బిగ్‌బాస్ 7వ సీజన్‌లో వెరైటీ టాస్కులు చూడబోతున్నామనేది స్పష్టమవుతోంది.
ఇందుకోసం అక్కినేని నాగార్జున మొత్తం ప్లాన్ చేసి రంగంలోకి దిగినట్లు సమాచారం. అలాగే ఎవరూ ఊహించని విధంగా కొత్త కంటెస్టెంట్ అయిన రతికా రోజ్ ఈసారి బిగ్‌బాస్ హౌస్‌ను హీటెక్కించే పని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమె బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది, నేను స్టూడెంట్ సార్ అనే ల్లో నటించింది. అలాగే గ్లామర్ డోస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా పిలిచే రతికా రోజ్.. ఇప్పుడు ఆ హౌస్‌లో రచ్చ చేయనున్నట్లు టాక్ నడుస్తో్ంది. మరో విషయం ఏంటంటే గత సీజన్లతో పోలిస్తే ఈసారి కొత్తగా వినోదాన్ని పంచనున్నట్లు ప్రోమో వీడియోలు చూస్తే స్పష్టంగా అర్థం అయిపోయాయి. గత సీజన్లను చూసుకుంటే కంటెస్టంట్లు అంతా ఇరుకైన గదిలో ఉండేవారు. కానీ ఈ ఏడాది మాత్రం హౌస్‌లో ఏకంగా మూడు బెడ్ రూంలు ఉన్నాయి. అలాగే గార్డెన్ ఏరియాలో చూసుకుంటే ఓ జైలు కూడా ఉంది. దాని పై భాగంలో చూస్తే ఒక బెడ్ రూం కనిపిస్తోంది.
ఇక్కడ మరో విషయం ఏంటంటే ఎవరికి ఏ బెడ్ రూం ఇస్తారు.. హౌస్‌లో అమ్మాయిలకు వేరేలా.. అబ్బాయిలకు వేరేలా ఇస్తారా ? లేక ఎప్పటిలాగే అందరిని కలిపి తోసేస్తారా అనే విషయం ఆసక్తికరంగా మారిపోయింది. అలాగే సీక్రెట్ గదిలో కూడా ఓ కంటెస్టెంట్‌ను ఉంచునున్నారు. అయితే అతను ఎవరూ అనే విషయం మాత్రం హౌస్‌లో ఉన్నవాళ్లకి కూడా తెలియదు. అయితే ఇది కూడా ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో ఓ ట్విస్ట్‌గా ఉండనుంది. ఇప్పటికే ఆరు సీజెన్లు విజయవంతంగా పూర్తి కావడంతో ఏడో సీజన్‌పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయిపోయింది. అయితే ఈ షోపై ఓ వైపు కొంతమంది విమర్శలు చేసినప్పటికీ కూడా చాలామంది ఈ షోను ఆసక్తిగా చూస్తుంటారు. అయితే ఈసారి మరీ ఎవరు బిగ్ బాస్ 7 విజేతగా నిలుస్తారో చూడాలి మరి.