Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 85

Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 87
‘సాంగ్ ఎలా చేస్తావో చూస్తా’ అన్నారు.. అందుకే బాబూమోహన్‌తో చేశా : ఎస్.వీ కృష్ణరెడ్డి – K News

‘సాంగ్ ఎలా చేస్తావో చూస్తా’ అన్నారు.. అందుకే బాబూమోహన్‌తో చేశా : ఎస్.వీ కృష్ణరెడ్డి

స్.వీ కృష్ణారెడ్డి.. తెలుగు చరిత్రలో మల్టీటాలెంటెడ్ డైరెక్టర్స్‌లో కృష్ణారెడ్డి ఒకరు. ఎన్నో అద్భుతమైన లు అందించారు కృష్ణారెడ్డి. ఫ్యామిలీ లకు ఆయన పెట్టింది పేరు.

అలీతో యమలీలలాంటి చేసి సూపర్ హిట్ అందుకున్నారు ఎస్.వీ కృష్ణారెడ్డి. ఆయన తెరకెక్కించిన చాలా లు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. అలాగే కృష్ణ రెడ్డి నుంచి వచ్చిన ల్లో మాయలోడు కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించారు. అలాగే రాజేంద్రప్రసాద్ సరసన సౌందర్య హీరోయిన్‌గా నటించింది. మాయలోడు లోని “చినుకు చినుకు సాంగ్” ఎంత పెద్ద సేసనేషన్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్కసాంగ్ కోసమే కు వెళ్లిన వారు కూడా ఉన్నారు. ఈ సాంగ్ కారణంగా 365 రోజులు ఆడిందని బాబూమోహన్ గతంలో తెలిపారు. ఇదే పాటను శుభలగ్నం చిత్రంలో ఆలీ,సౌందర్యతో కూడా మళ్లీ తెరకెక్కించారు కృష్ణ రెడ్డి.

'సాంగ్ ఎలా చేస్తావో చూస్తా' అన్నారు.. అందుకే బాబూమోహన్‌తో చేశా : ఎస్.వీ కృష్ణరెడ్డి

అయితే మాయలోడు లో చినుకు చినుకు సాంగ్ బాబు మోహన్ సౌందర్య మధ్య వస్తుంది. అంత సూపర్ హిట్ సాంగ్ హీరో, హీరోయిన్ మధ్య కాకుండా కమెడియన్, హీరోయిన్ మధ్య పెట్టడం సాహసమనే చెప్పాలి. తాజాగా ఈ సాంగ్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు కృష్ణ రెడ్డి.

ఈ సాంగ్ విషయంలో రాజేంద్ర ప్రసాద్ ఇబ్బంది పెట్టడంతోనే బాబూ మోహన్ తో చేయాల్సి వచ్చిందని తెలిపారు కృష్ణ రెడ్డి. ‘నువ్వూ డ్యాన్సులు చేస్తావట కదా.. నువ్వూ స్టెప్పులు వేస్తావట కదా..’ నా పై సెటైర్లు వేశారు అని తెలిపారు. దాంతో నాకు కొంచం బాధగా అనిపించింది. అలాగే మాయలోడు లాస్ట్ స్టేజ్ కు వచ్చిన సాయంలో రాజేంద్రప్రసాద్ డేట్స్ అడ్జెస్ట్ కాలేదు. ఆయన డేట్స్ తక్కువగా ఇవ్వడంతో ఇంకొన్ని డేట్స్ ఇవ్వమని అడిగితే ఆయన సహకరించలేదు. బ్రతిమిలాడుకున్నా కూడా ఆయన వినలేదు. చివరకు ఆయనతో మిగిలిన డేట్స్ తో డబ్బింగ్ పూర్తి చేశాం.. అయినా ఒక్క సాంగ్ మిగిలిందిగా ఎలా చేస్తావో చూస్తా అన్నారు. సాంగ్ షూటింగ్ కు రండి అని పిలిస్తే.. “నేను రాను.. సౌందర్య డేట్స్ ఇచ్చిందన్నావ్‌గా ఎలా చేస్తావో చేసుకో పో” అన్నారు అని తెలిపారు కృష్ణ రెడ్డి. దాంతో ఆ పాటను బాబూమోహన్ తో తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాను. అది తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ కొంతమందిని నా దగ్గరకు పంపించి సాంగ్ చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు అని చెప్పుకొచ్చారు కృష్ణారెడ్డి. లేదు నేను బాబూమోహన్ కు మాటిచ్చాను.. కావాలంటే షూటింగ్ స్పాట్ కు వచ్చి సాంగ్ చూడొచ్చు అని చెప్పను అని అన్నారు కృష్ణ రెడ్డి. అయితే తాను ఇండస్ట్రీలో ఎదగడానికి రాజేంద్రప్రసాద్ సహకారం ఎంతో ఉంది అని అన్నారు కృష్ణారెడ్డి. కానీ ఈ ఒక్క సమయంలోనే నను బాధపెట్టారు అని అన్నారు ఎస్.వీ కృష్ణ రెడ్డి.

Leave A Reply

Your email address will not be published.