విందులో ఆందోళన ..వీపులు విమానం..మంత్రి ముందే.. లొల్లి..
కయ్యానికి కాలు దువ్విన కరీంనగర్ కార్పొరేటర్లు
కరీంనగర్: కరీంనగర్ తెరాస మున్సిపల్ కార్పొరేటర్ల లో చీలీకలు మొదలైయ్యాయి. రెండు వర్గాలుగా వీడి పోయిన అధికార పార్టీ కార్పొరేటర్లు తమపై తామే కయ్యానికి కాలు దువ్వడం చర్చనీయాంశంగా మారింది. మరో వైపు జిల్లాకు చెందిన మంత్రి, కరీంనగర్ ప్రథమ పౌరుని ముందే గలాటా జరగడం రసవత్తరంగా మారింది. ఇంకో వైపు గంగుల పట్ల గుర్రుగా ఉన్న నేత కూడా అక్కడే ఉండడం ఈ లొల్లికి ఆజ్యం పోసినట్లైనది. మొత్తానికి గత కొంత కాలంగా తమలోని మధన పదుతున్న అంశాలను నేతల ముందు వేళ్ళ గక్కారు. ఈ అంశంలో పంపక్కలే కారణం కావడంతో అన్ని వర్గాలు విస్తుపోతున్నాయి. ఒక వర్గం పార్టీని వీడుతామంటే.. వద్దు అని మరో వర్గం మధ్య వాదోపవాదాలు జరిగాయి.
గత రాత్రి కరీంనగర్ లోని ఓ నక్షత్రాల హోటల్ లో మంత్రి సమక్షంలో కార్పొరేటర్లు సమావేశమైనారు. అయితే ఓ ముఖ్య నేత మంత్రికి అనుంగు అనుచరుడిగా వ్యవహరించి 15 ఏళ్ల సాన్నిహిత్యాన్ని వదిలిపెట్టి పార్టీ మారడం మరోవైపు ప్రత్యర్థి శిబిరంలో చేరడం అధికార పార్టీని కుదిపేసింది. నష్ట నివారణకు దిగిన అధిష్టానం ముందే లుకలుకలు బయటపడ్డాయి. నేను నా శారిష్మాతో గెలిశాను. నాకు తెరాస చేసిందేమి లేదని కొందరు. నాతోనే తెరాస కు గుర్తింపు వచ్చింది తప్ప.. తెరాసతో నాకు ఒరిగింది ఏమీలేదు.. మరికొందరు. ఇలా ఒకటి కాదు.. వారి వారి కాంట్రాక్టు పనులు.. లాభాలు. ప్యారవీలు తదితర అంశాలపై వాదోపవాదాలు జరిగిగాయి . అదే హద్దు మీరడం ఓ దఫా స్వయంగా మంత్రి వారించినా.. కార్పొరేటర్లు ససేమిరా అంటూ చొక్కలు పట్టుకున్నారు. వీపులు విమానం మ్రోగించుకున్నారు. ఇక పార్టీలో ఉండలేము. వలస తప్పదని బహిరంగంగానే కార్పొరేటర్లు వాదించుకోవడం విస్మయాన్నికల్గించింది. అర్దరాత్రి కార్పొరేటర్ల గుద్దులాటలు. తన్నులాటలు యావత్తు తెలంగాణ అంతటా జనంలో చర్చ జరుగుతోంది. కరీంనగర్ అంశం తెలంగాణా భవన్ కు చేరుకుంది. ఈ నేపథ్యంలో అసంతృప్తితో ఉన్న నేతలు ఎవరు..? ఏ డివిజన్లో రాజకీయ పార్టీ మార్పులు సంభవించనున్నాయి? ఆయా ప్రాంతాల్లో చర్చలు జోరందుకున్నాయి. ఇదే అదునుగా బీజేపీ వచ్చే నేతలకు గ్రీన్ కార్పెట్ పర్చేందుకు ‘సిద్దమవగా ఈ పరిణామాలపై కాంగ్రెస్ పరిశీలనకు దిగింది. కాగా మంత్రి గంగుల కమలాకర్ రంగం లోకి దిగి పరిష్టితిని చక్కదిద్దెందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంత వరకు సఫలీకృతం అవుతారన్నది తేలాల్సి ఉంది.