టీఆర్ఎస్‌కు జంకు…నేతల జంప్..
ఎన్నికలంటే వణుకు.. పెద్దాయనకు చురుకు..
బీజేపీ ప్రాభల్యం, బీజేపీ ఆకర్ష్ ఎఫెక్టుతో అధికార టీఆర్ఎస్ జంకుతోంది. వరస ఎన్నికలలో కమలం వికసింపు చూసి టీఆర్ఎస్ నేతల్లో… దురద మొదలైనది. అభివృద్ధి అంటే మాదే.. అంటూ జబ్బలు చరుసుకున్న ఆ పార్టీ.. ఎన్నికలంటే ఎందుకు భయపడుతోంది.. .? . 2014 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ విజయబావుట ఎగురవేసిన గులాబీ పార్టీకి నాలుగేండ్ల క్రితం ఉన్న అనుకూల పరిస్థితులు నేడు కనిపించడం లేదని చెప్పొచ్చు.? ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నకల్లో టీఆర్ఎస్ ఊహించని షాక్ తగిలింది. బీజేపీ విజయం సాధించింది. జీహెచ్ఎంసీలోనే కారు స్పీడ్ కు కమలం బ్రేకులు వేసి కోలుకొని దెబ్బ తీసింది ఈ వరస కమల వికాసంతో ఎన్నికలంటేనే టీఆర్ఎస్ వీపులో జంకు పుడుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనేది మెసేజ్ ప్రజల్లోకి వెళ్లిపోయింది.ఉత్తర తెలంగాణ జిల్లాలో టీఆర్ఎస్ నుండి బీజేపీ లోకి ఇప్పటికీ వలసలుకొనసాగుతున్నాయి. దీంతో వరస విజయాలతో జోష్ మీదున్న బీజేపీ .. ఇప్పుడు నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టింది. దీంతో టీఆర్ఎస్, సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులు సుదీర్ఘ ఆలోచనలో పడ్డారు. ప్రజలను తనవైపు తిప్పుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.దుబ్బాక, జీఎహ్ఎంసీ ఓటమి మళ్ళీ ..మల్లి రిపీట్ కాకుండా చూసేందుకు కసరత్తులు ప్రారంభించారు. నాగార్జున సాగర్ ఎన్నికల ముందే జరుగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు ఒకేసారి 50వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉపాధ్యాయ, పోలీస్ శాఖలతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ పై దృష్టి సారించింది. ఉద్యోగాల భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్‌లు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగాల మాటెత్తని కేసీఆర్ ఉన్నపలంగా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని ప్రకటించడంతో కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.