రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని కలెక్టరేట్ ముందు వామపక్ష, ప్రజా సంఘాల దీక్ష
దీక్షను ప్రారంభిన సీపీఐ జిల్లా కార్యదర్శి పోనగంటి కేదారి
కరీంనగర్: యావత్ భారత రైతాంగానికి నష్టం కలిగించే రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణల చట్టం రద్దు చేయాలని,ఢిల్లీలో రైతుల పై ప్రభుత్వ ధమన కాండను నిరసిస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష సీపీఐ జిల్లా కార్యదర్శి పోనగంటి కేదారి ప్రారంభించారు.. ఈ దీక్ష సందర్భంగా కేదారి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి నష్టం కలిగించే మూడు నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని,రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా కార్పొరేట్ శక్తులకు,పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధానాలను అవలంభిస్తుందని,ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో అనేక రాష్ట్రాల రైతాంగం ఆందోళన చేస్తుంటే చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని యావత్ భారత దేశంలో రైతులు,ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నా దేశ ప్రధాని మోడీ కి కనువిప్పు కలగడం లేదని ఉద్యమం తీవ్ర రూపం దాల్చక ముందే కేంద్ర ప్రభుత్వం ఆ మూడు చట్టాలను రద్దు చేయాలని కేదారి డిమాండ్ చేశారు. మొదటి రోజు దీక్షలో కూర్చున్నవారు కె.వి.పి.ఎస్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కాంపెళ్లి సాగర్,తిప్పారపు సురేష్,గిరిజన సంఘం రవినాయక్,లక్ పతి,ఆర్.పి.ఐ కుతాడి శ్రీనివాస్, పులిపాక సాయి,రోహిత్,కరుణాకర్ఈ దీక్షకు మద్దతు తెలిపినవారు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వర్ణ వెంకట రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్,ఎ ఐ ఎఫ్ బి జిల్లా కార్యదర్శి పైడిపల్లి రాజు,పి.డి.ఎస్.యు జిల్లా ఉపాధ్యక్షుడు అంగిడి కుమార్, తెలంగాణ జే. ఏ.సీ జిల్లా చైర్మన్ వెంకట మల్లయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్,ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్,సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవ్ రెడ్డి,ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి,ఎఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బ్రామండ్ల పెల్లి యుగేందర్,ఎ ఐ ఎఫ్ బి రాష్ట్ర కమిటీ సభ్యులు గవ్వ వంశిధర్ రెడ్డి,డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గుగులోతు తిరుపతి, ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు ధర్ముల రామ్మూర్తి, సీపీఐ నాయకులు ముత్యాల శ్రీనివాస్ రెడ్డి నల్లగొండ శ్రీనివాస్, నునావత్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు