Print Friendly, PDF & Email

 నర్సులను తిరిగి ఉద్యోగంలో తీసుకోవాలి

డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి.

0 0

కరీంనగర్: ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజా కరోనా వ్యాధి గ్రస్తులను కాపాడాలి అని సంకల్పంతో వారధి ద్వారా ఉద్యోగం పొందిన నర్సులను ల్యాబ్ టెక్నీషియన్ నేడు తొలగిస్తున్నామని బలవంతంగా వారితో సంతకాలు పెట్టి మెమోలు తొలగించినట్టు సూపర్డెంట్ ప్రకటించారు అని వారధి వైద్య ఉద్యోగస్తులు అంటున్నారని అన్నారు. తొలగించిన వారిని తక్షణమే ఉద్యోగంలో తీసుకోవాలని తిరుపతి డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ముందు వారి ద్వారా ఉద్యోగం కోల్పోయిన వైద్య నర్సులు ల్యాబ్ టెక్నీషియన్ లతో కలిసి వారికి మద్దతుగా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.అనంతరం తిరుపతి మాట్లాడుతూ వైద్య నర్సులను ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బలవంతంగా సంతకాలు పెట్టించి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని చెప్పి సూపర్డెంట్ మేమొలు ఇవ్వడం సరైంది కాదని ఆయన అన్నారు. కరోనా సమయంలో కరోనా వ్యాధి గ్రస్తులకు ఎవరు వైద్యం అందించకపోతే మేము వైద్యం అందిస్తాం అని ముందుకు వచ్చిన నర్సు లను తొలగించడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. గత 5 నెలల నుండి వైద్య సేవలు అందించి రెండు నెలల నుంచి జీతాలు తీసుకోకుండా నేడు తొలగిస్తామని ప్రకటించడం వారి యొక్క కుటుంబాలు వీధిన పడే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయాలని సంకల్పంతో ప్రైవేట్ ఆస్పత్రిలో వారి యొక్క ఉద్యోగాలకు రాజీనామా చేసి నేడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయడానికి ముందుకు వస్తే వారిని తొలగించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో శాస్త్ర చికిత్స కొరకు గత 15 రోజుల నుండి రోగులు వస్తే నేటి వరకు శాస్త్ర చికిత్స చేయకుండా కాలయాపన చేస్తున్న వైద్యులు పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా నేడు ఉద్యోగంలో నిజాయితీగా సమయపాలన పాటిస్తూ కరోనా రోగి వ్యాధి గ్రస్తులను వైద్య అందిస్తున్న నర్సులను ప్రభుత్వ వైద్య ఉద్యోగంలో తీసుకొని వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. జిల్లా ఉన్నతస్థాయి అధికారులు స్పందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన అన్నారు. వారిని తిరిగి ఉద్యోగంలో తీసుకోకపోతే మరింత ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి డి నరేష్ పటేల్ నాయకులు రవీందర్ నాయక్. తొలగించిన వైద్య అభ్యర్థులు, కోమల, శ్రీలత, బిందు,అమని, మానస, ఉమా మహేశ్వరి, జన్షి, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents