బీజేపీ ‘సర్జికల్ స్ట్రైక్’..
టచ్‌లో అసంతృప్తి నేతలు..
తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి… ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి. వీలైనంత త్వరగా తెలంగాణ అంతటా బలోపేతం కావాలి. రానున్న ఎన్నికల్య్ అధికారమే లక్ష్యంగా దూసుకెళ్లాలని ఆశిస్తోన్న కమలనాథులు శరవేగంగా వ్యూహరచన చేస్తున్నారు. పకడ్బందీగా భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రాంతాల వారీగా బలాబలాలను బేరీజు వేసుకుంటున్నారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఉత్సాహంతో. టీఆర్‌ఎస్ పార్టీల్లోని అసంతృప్త, కీలక నేతలను కాషాయదళంలోకి తీసుకురావడంపై ప్రత్యేకదృష్టి పెట్టింది..పార్టీలోకి వచ్చే నాయకులతో మాట్లాడే బాధ్యతలు అప్పగించి… అధినాయకత్వంతో భవిష్యత్తుకు భరోసా ఇప్పిస్తోంది. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించింది. ఇందులో భాగంగా గతంలో బీజేపీ గెలిచిన స్థానాలు, గట్టిపోటీనిచ్చిన స్థానాలు, ప్రజలు బీజేపీపై ఆదరణ చూపిన ప్రాంతాల్లో మొదట పట్టు సాధించాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. వాటితో పాటు దశలవారీగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలపైనా దృష్టి పెట్టేలా కార్యాచరణ అమలులో పెట్టనుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో పలువురు నాయకులు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల నుంచి బీజేపీలో చేరారు. కొందరు మంత్రి స్థాయి నేతలు, ఎమ్మెల్యేలు కూడా వస్తారనే ధీమాతో ఉంది. వారితో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఢిల్లీకి చెందిన మరికొందరు ముఖ్యనేతలకు అప్పగించింది.
త్వరలో రానున్న గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. జిల్లాల్లో పార్టీ విస్తరణకు కోసం పెద్ద ఎత్తున చేరికలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ టీఆర్‌ఎస్‌లోని అసంతృప్త నేతలే టార్గెట్‌గా ముందుకు వెళుతోంది. మెదక్ జిల్లాపైనా కసరత్తు చేస్తోంది. దుబ్బాకలో బీజేపీ విజయం… పార్టీలోకి వలసలను పెంచుతుందనే ధీమాలో ఉంది. ఇక చివరగా ఖమ్మం, నల్గొండ జిల్లాలపై దృష్టి సారించేలా చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో ఒకప్పుడు బీజేపీకి పట్టున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిం చింది. చాలాచోట్ల గ్రామీణ ప్రాంతా ల్లోనూ పార్టీకి కేడర్ ఉందని, సైలెంట్ ఓటర్లు ఉన్నారని… బలమైన నాయకత్వం అవసరమని భావి స్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీలోకి వచ్చే నేతల జాబితాలను సిద్ధం చేస్తోంది. తొలుత కరీంనగర్ లో తెరాసను ఖాళీ చేయి బీజేపీని బర్ ఫుల్ చేయాలనీ పకడ్బందీగా భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నారు