రూ . 2.50 కోట్లతో అధునాతన ప్రజా మరుగు దొడ్ల ఏర్పాటు
మాడ్రన్ టాయిలెట్స్ ను ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్: ప్రజలకు మెరుగైన వసతి, సౌకర్యాలు కల్పించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యం అన్నారు పౌరసరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ అభివృద్దిలో భాగంగా ఈ రోజు నగర మేయర్ వై.సునిల్ రావు, జిల్లా కలెక్టర్ కే.శశాంక, కమీషనర్ వల్లూరు క్రాంతి, పాలక వర్గ సబ్యులతో కలిసి 3 మాడ్రన్ టాయిలెట్స్ ను ప్రారంభించారు. నగరంలోని ఉజ్వలా పార్కు, అంభేడ్కర్ స్టేడియం, కలెక్టరెట్ కాంప్లెక్స్ వద్ద నూతనంగా అధునాతన పద్దతిలో నిర్మాణం చేసిన టాయిలెట్స్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంబించారు. నగర వ్యాప్తంగా నగరపాలక సంస్థ ఆద్వర్యంలో పట్టణ ప్రగతి చెందిన 2.50 కోట్ల రూ. నిధులతో 15 చోట్ల మరుగు దొడ్లను నిర్మించారు. 15 మాడ్రల్ టాయిలెట్స్ పురుషులు, మహిళలకు వేరు వేరుగా గా100 యూరినల్ షీట్స్, బేబీ ఫీడింగ్ రూం లు, డైపర్ చేంజింగ్ రూంలు, స్నానాల గదులు, మహిళలకు ప్రత్యేకంగా సానిటరీ నాప్ కీన్ బర్నింగ్ యంత్రం లాంటి వసతి సౌకర్యాలను ఇందులో కల్పించారు. ఈ సంధర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… ప్రజల అవసరాలు, శ్రేయస్సు మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఆలోచనకు అనుగుణంగా పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ గారి ఆదేశాల ప్రకారం కరీంనగర్ నగరంలో అధునాతన పద్దతిలో 15 మాడ్రన్ టాయిలెట్స్ ను నిర్మించామని తెలిపారు. వీటన్నిటినీ రేపటి నుండే ప్రజలకు వాడుకలోకి తెస్తామని స్పష్టం చేశారు. వీటి పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకొని నగరపాలక సంస్థ ఆద్వర్యంలో టెండర్ ప్రక్రియ ద్వారా ఔట్ సోర్సింగ్ నిర్వాహాకులు అప్పగించి… వీటి నిర్వహాన బాధ్యతలు చేపడుతామని తెలిపారు.
అంతే కాకుండ నగరంలో ప్రజలు సంచరించే ప్రదేశాల్లో అదనంగా మొబైల్ టాయిలెట్స్ ను కూడ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ మొబైల్ టాయిలెట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. గతంలో నగర ప్రజలు సరిపడ టాయిలెట్స్ లేక చాలా ఇబ్బందులకు గురైన పరిస్థితి ఉండేదని… తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వత అలాంటి సమస్య రాకుండానే జనాభ ప్రతిపదికన మాడ్రన్ టాయిలెట్స్ ను నిర్మించామని స్పష్టం చేశారు. ప్రజల అవసరాలు, సౌకర్యాలు, వారి శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేసేందుకైనా సిద్దంగా ఉందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నగరంలో రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తూనే… అహ్లదాన్ని పంచేందుకు పార్కులు మరియు మానేరు రివర్ ఫ్రంట్ లాంటి పర్యటక కేంద్రాలను కూడ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో కరీంనగర్ నగరాన్ని అన్ని హంగులతో అభివృద్ది చేసి… ప్రజలకు వసతులు, సౌకర్యాలు కల్పించి… మెరుగైన పరిపాలన అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణీ హారిశంకర్, మాజీ మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్, పలు డివిజన్ల కార్పోరేటర్లు, ఇంజనీరింగ్ అధికారులు ఎస్ సీ కృష్ణరావు, ఈఈ రామన్, డీఈ లు వెంకటేశ్వర్లు, ఓంప్రకాష్, ఏఈ వెంకట్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.