శృంగార వాంఛ తగ్గడానికి కారణాలు…

0 2

దంపతుల మధ్య అనేక కారణాల వల్ల కొన్నేళ్ళకు శృంగార

జీవితం రసహీనంగా మారిపోతుంది. ఆర్థిక పరిస్థితులు, పిల్లల పెంపకం, ఉద్యోగ వ్యాపారాల కోసం ఎక్కువ సమయం బయటే గడపాల్సి రావడం, స్త్రీలు అటు ఉద్యోగాలు, ఇటు ఇంటిపనుల మధ్య సతమతమవుతూ అలసి పోవడం, దంపతుల మధ్య అపోహలు, అపార్థాలు, ఇంట్లోని సభ్యుల మధ్య అవగాహనా లోపం, నిరంతర ఘర్షణలతో కూడిన వాతావరణం, అనేక రకాల మందులు, వ్యాధుల వల్ల శృంగారాసక్తి, సామర్థ్యం తగ్గడం.

 

ఉదా: డయాబెటిస్, బీపీ, గుండె జబ్బులు, ఆస్తమా, లివర్, కిడ్నీ, వివిధ రకాల వ్యాధులు. పరస్పరం ప్రేమ వున్నా సమయం లేకపోవడం వల్లనో లేదా శరీర స్పందనలకు, ఐక్యతకు దూరమవుతూ చాలామంది దంపతులు మానసిక ఒత్తిడితో ఎడబాటుకూ లోనవుతుంటారు. ఒకపక్క యాంత్రిక జీవితపు ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నాలు

చేస్తూనే మంచి శృంగార జీవితాన్ని ఆనందించే ప్రయత్నాలు దంపతులు చేయాలి. ప్రేమానురాగాలతో కూడిన స్పర్శ మనిషికి బతకడానికి చాలా అవసరం. మానసిక సాన్నిహిత్యం, అనురాగం ఒకరిపట్ల ఒకరికున్న

బాధ్యతలను తెల్సుకునేందుకు ప్రతి రోజూ లేదా రోజు విడిచి రోజైనా శృంగారంలో పాల్గొనాల్సిన అవసరం లేదు. చిన్నచిన్న స్పర్శలు, ఆలింగనాలు, ముద్దులు, ప్రేమ పూర్వకమైన చూపులు, చిరు కానుకలు, మెచ్చుకోళ్ళు, పరస్పరం ఇంటి పనుల్లో సహకరించుకోవడం వంటివన్నీ

కూడా శృంగారానుభవాన్ని మించిన ఆనందానిస్తాయి. శృంగారం వల్ల శరీర తృష్ణ తీరుతుంది. కానీ, శృంగారం సాధ్యం అయినప్పుడు, కానప్పుడు కూడా పైన చెప్పిన పద్ధతుల్లో శృంగార భాషను అర్థం చేస్కుంటే శరీరానందానికి మించిన మానసిక సుఖసంతోషాలను దంపతులు అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. అది వారి చేతుల్లోనే ఉంటుంది.

శృంగార వాంఛ తగ్గడానికి కారణాలు

సైంటిఫిక్ గా రుజువు చేయబడ్డాయి. అవేంటో మనం ఇప్పడు తెలుసుకుందాం… సెక్స్ అనే పదం వింటేనే మనలో చాలా మంది దృష్టి అటువైపు మళ్లుతుంటుంది. శృంగార రసభరిత కథనాలు చదివేందుకు ఇష్టపడేవారు ఎందరో ఉంటారు. కొత్త ప్రదేశాల్లో సరికొత్త భంగిమల్లో రతి

క్రీడ జరపాలని తహతహలాడేవారు లేకపోలేదు. అయితే కాలం గడిచే కొద్దీ దీనిపై ఆసక్తి తగ్గిపోతుంటుంది. ఏదో మొక్కువడి వ్యవహారంగా చేసుకుంటూ పోతారు. అసలు కొన్ని రోజుల దాకా శృంగారంలో పాల్గొనాలన్న ధ్యాసే ఉండదు. ఇదే అంశమై ఓ సంస్థ సర్వే నిర్వహించి ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. బీఎమ్ జే ఓపెన్ అనే ఓ ఆన్లైన్ జర్నల్ సంస్థ ఒక బృందాన్ని ఎంచుకొని

శృంగారానికి సంబంధించి ప్రశ్నలు అడిగింది. ఇందులో మొత్తం 4,839 మంది పురుషులు, 6,669 మంది స్త్రీలు పాల్గొన్నారు. వీరంతా 16 నుంచి 74 ఏళ్ల వయసులోపు వారు. వీరంతా ఏడాది కాలంగా సెక్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నవారు కావడం విశేషం. సర్వే ద్వారా తెలిసిన

నిజాలేమిటంటే 15శాతం పురుషుల్లో సెక్స్ కోరికలపై ఆసక్తి తగ్గగా… మహిళల్లో 34శాతం శృంగారమంటే ఆసక్తి తగ్గిందని చెప్పారు. వయసు పెరిగిపోవడం, శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడం లాంటివే ప్రధాన కారణాలుగా తేల్చారు. కొందరు శృంగారంలో పాల్గొనడం వల్ల సుఖవ్యాధులు సంక్రమించాయని దాని వల్ల సెక్స్ పై ఆసక్తి తగ్గిపోయిందని అన్నారు. గతంలో బలవంతంగా శృంగారంలో పాల్గొన్నవారికి కూడా సెక్స్ పైన సదభిప్రాయం లేకుండా పోయింది. గతంలో శృంగారపర సమస్యలు ఎదుర్కొన్నవారు తమ భాగస్వామితో పూర్తి స్థాయిలో

ఆనందించలేకపోయినట్టు వెల్లడించారు. శృంగారంపై ఆసక్తి తగ్గినవారికి నిపుణులు పలు సూచనలు ఇచ్చి నూతనోత్తేజం కలిగేలా ప్రయత్నిస్తారు. ఫోరప్లే, హస్తప్రయోగాలతో సరిపెట్టుకోకుండా మరింత రంజితంగా సెక్స్ జరపాలని వారు సూచించారు. భాగస్వాములిద్దరూ ఒకరి చేతులను ఒకరు ఒడిసిపట్టుకోవడం, కౌగిలింతలు, అధర చుంబనాలు చేసుకోవడం ద్వారా నూతన రసస్వాదం కలుగుతుంది. దీంతో నవనాడులు నూతనోత్తేజాన్ని సంతరించుకొని శృంగార జీవితం రసభరితం. అవుతుంది. ఇంట్లో నిరంతరం సంచరించే ఏ గదిలోనైనా అటువంటి

భావాలు కలగవచ్చు. పడకగదిలో ఉండే పరిమళం స్వచ్ఛమైన పడకలు, మంచి రంగులు, శృంగారానుభూతిని కలిగించే చిత్రాలు ఇవన్నీ కల్సి శృంగార వాంఛ కలిగేందుకు సహకరించినా దంపతులు రోజంతా ఇంటా, బయటా ఒకరితో ఒకరు ఎలా గడిపారనేది కూడా ఇక్కడ అంతకంటే అధిక ప్రాధాన్యం కలిగి ఉంటుంది. గడిచిన కాలంలో వారు ఒకరి కొకరు ఎటువంటి అనుభవాలు, అనుభూతులు మిగుల్చుకున్నారు అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి.

ఇద్దరి సహచర్యంలో, సమస్యల పరిష్కారంలో మిత్రపరమైన

సామరస్యం ఉందా, శత్రుపరమైన వైరుధ్యమేనా? ఘర్షణను

సుదీర్ఘమైన వాదోపవాదాల ద్వారా పరిష్కరించుకున్నారా? ఇరువురి మధ్య సయోధ్య, ఐక్యత కుదిరాయా? లేదా ఘర్షణల్లోనే కాలం గడుపుతూ శృంగారాన్ని అనుభవిస్తున్నారా? అనేది చాలా ముఖ్యం. నిరంతరం కోపం, అసహనం, చిరాకు, అహంకారాలు, అయిష్టతలతోనే

గడుపుతుంటుంటే అది ఇరువురి మనసుల్లో గాయాలనే మిగిలిస్తుంది. ఈ పరస్పర వైరుధ్యాలు, అనైక్యతలు దంపతుల శృంగార జీవితాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. శృంగారాన్ని యాంత్రికంగా మారుస్తాయి. దాని గొప్పదనాన్ని గుర్తించి ఆ మేరకు ఒక అపురూపమైన, విలువైన అనుభూతిగా మిగుల్చుకోగలగాలి. దానిని జీవితానికి ఒక గౌరవంగా మాత్రమే చూడాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆధిపత్యమూ, అహంకారమూ, స్వార్థమూ, దుర్మార్గమూ లేని భర్త స్పర్శకు భార్య పులకించడమే నిజమైన శృంగారం.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents