అల్పహారంలోకి పళ్ళు తింటున్నారా… ? .. అయితే జాగ్రత్తా…
ఈ పదార్థాల వల్ల ఎమౌతుందో తెలుసా ?
ఉదయం లేవగానే చాలా మంది సరైన ఆహారాన్ని తీసుకోరు. కొంత మంది అసలు టిఫిన్ కూడా చేయకుండా ఉండిపోతారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం తొందరగా దెబ్బతింటుంది. కానీ ఉదయం పూట మంచి అల్పాహరాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. మరికొంత మంది తమ బ్రేక్ ఫాస్ట్‌కు పండ్లను తీసుకుంటూ ఉంటారు. పండ్లు తినడం వలన శరీరానికి మంచిదే.. కానీ ఖాళీ కడుపుతో పండ్లు తినడం వలన కలిగే నష్టాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండు తినడం వలన ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఈ పండు తినకుడదట. దీనివల్ల వాంతులు, కడుపులో అసౌకర్యం కలుగుతుందట. వీటితోపాటు సలాడ్ కూడా తినకూడదు. ఖాళీ కడుపుతో సలాడ్ తినడం వలన కడపులో గ్యాస్ పెరిగడంతోపాటు, గెండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక నారింజ, నిమ్మ, కివీ వంటి సిట్రల్ జాతి పండ్లను ఉదయాన్నే తినడం అనేది ఆరోగ్యానికి హానికరం. ఖాళీ కడుపుతో వీటిని తినడం వలన గ్యాస్ట్రిక్, గుండెల్లో మంటి వంటి సమస్యలు వస్తుంటాయి. ఈ సిట్రస్ జాతీ పండ్లలో ఆమ్లం ఉండడం వలన ఇలాంటి ఆనర్ధాలు జరుగుతాయి. వీటితోపాటు టమోటాలలో కూడా సిట్రస్ వంటి ఆమ్లాలు ఉంటాయి. ఉదయాన్నే టమోటాలు తినడం కూడా శరీరానికి చెడు చేస్తాయి. ఖాళీ కడుపుతో టమోటాలు తింటే గ్యాస్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా కూల్ డ్రింగ్స్ లేదా జ్యూస్‌లు తాగడం కూడా మంచిది కాదు. అల్పహారంలోకి వీటిని తీసుకుంటే కడుపులో వాయువులు పెరుగిపోతాయి.
ఇలాంటివి కాకుండా ఉదయాన్నే అల్పహారంలోకి పిండి పదార్థాలను తీసుకోవడం మంచిది. అంటే చపాతిలు, పూరిలు, జొన్న, రాగి లేదా సజ్జలతో చేసిన వాటిని తీసుకువడం మంచిది. వీటివలన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అందుతాయి. ఉదయాన్నే పాలు, గుడ్లు, కూరగాయలు, బాదం పప్పు, బ్రేడ్డు, పుల్కలు ఇలాంటివి తీసుకోవడం ఉత్తమం. అంతేకాకుండా రోజంతా ఎంతో హుషారుగా, ఆరోగ్యంగా ఉంటారు. ఉదయం టిఫిన్ చేయకపోవడం వలన మధుమేహం, బిపీ హెచ్చుతగ్గులు, గుండె జబ్బులు వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.