11న తొలి టీకా?
వారంలోనే రాష్ట్రంలో కరోనా టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభం కానుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం నుంచి అందిన సంకేతాల మేరకు ఈ నెల 11న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఒక కీలకాధికారి సోమవారం తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కరోనా టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.