కరివేపాకు కదా అని తక్కువ చూడద్దు…
మనం తినే పదార్థాల్లో ప్రతి రోజు వాడుకునేది కరివేపాకు, కరివేపాకు అనేది ప్రాంతీ ఇంట్లో ప్రతి వంట గదిలో ప్రతి వంటకంలో ఉంటుంది. ఒకప్పుడు కరివేపాకు చెట్లు ఇళ్లలో ఉండేవి, కాలక్రమేణా కరివేపాకు చెట్లు అనేవి కనుమరుగయిపోయావు, కానీ గ్రామాల్లో మాత్రం కొందరి ఇళ్లలో ఇప్పటికి ఉన్నాయనుకోండి . ఇక సిటీ విషయానికి వస్తే కరివేపాకు చెట్లు పక్కనపెడితే కరివేపాకు వాడుకోవాలంటే కొనుక్కోవలసిందే. ఇంట్లో వంట రుచిగా ఉండాలంటే కరివేపాకు కంపల్సరీ అయిపొయింది. కరివేపాకు లేదు అంటే ఎంత చేసిన ఆ వంట రుచి లేదు అన్నట్టే ఉంటుంది. కరివేపాకు వేసిన కూడా కొందరు వాటిని తీసి పక్కన పెడతారు. అందుకే కూరలో కరివేపాకు అనే సామెత కూడా వచ్చింది. ఏది ఎలా ఉన్నా కసిరివేపాకు అనేది మన నిత్యజీవితంలో ఎంతో ముఖ్యమైనదిగా మారిపోయింది. మరి మనం ప్రతి రోజు తినే కరివేపాకులో ఏమి ఉంది ఏమి లేదు అనే విషయాలు మీకు తెలుసా..?? అయితే ఒక్కసారి ఇది చదవండి.
* ఇనుము, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఈ ఆకును రోజూ మనం తినే పదార్థాల్లో ఏదో ఒకదానితో కలిపి తీసుకోగలగాలి. ఇది రక్తహీనతను దూరంగా ఉంచుతుంది
* రక్తంలో చక్కెర స్థాయిలు సమతూకంలో ఉండాలంటే… కొన్ని రోజులు కరివేపాకును ఆహారంలో కలిపి తీసుకుని చూడండి. ఈ ఆకులో పీచు ఎక్కువగా ఉండటంతో రక్తంలోని చక్కెర స్థాయి పెరగకుండా ఉంటుంది.
* శరీరంలో అధిక కొవ్వును తగ్గించే గుణం ఈ ఆకులో ఉంది. ఇది బరువు పెరగకుండా శరీరాన్ని నియంత్రిస్తుంది.
* ఈ ఆకులో యాంటీయాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మేలు చేసే కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. హృద్రోగాలు దూరమవుతాయి.
* కరివేపాకును ఆహారంలో తీసుకుంటే జుట్టు రాలిపోకుండా చుసుకోవచ్చు. కరివేపాకును ముద్దలా చేసుకుని తలకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేస్తే.. జుట్టు పెరుగుతుంది