మహిళల హాకీ టోర్నమెంట్
కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో శ్రీ గురుగోవింద్ సింగ్ మహిళా హాకీ టోర్నమెంట్‌ను రాష్ట్ర బిసి సంక్షేమ, పౌర సరఫరా మంత్రి గంగుల కమలకర్ ప్రారంభించారు.ఈ నెల 15 నుండి 17 వరకు మూడు రోజులు ఈ టోర్నీ జరుగుతుంది. ఈ సందర్భంగా అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి సౌందర్యను మంత్రి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆటగాళ్లను పరిచయం చేశారు. ఆటగాళ్లతో సరదాగా మంత్రి గంగుల కమలకర్ అమ్మాయిలతో హాకీ ఆడుకున్నారు. మంత్రి గంగుల కమలకర్‌తో పాటు మేయర్ సునీల్ రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, తెలంగాణ హాకీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ హర్మీత్ కౌర్, ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్ సౌందర్య, ఒలింపిక్ అసోసియేషన్ బాధ్యతాయుతమైన నందెల్లి మహీపాల్, కల్యాణి మేనేజింగ్, కమల్ జిత్ కౌర్, కార్పొరేటర్లు, టిఆర్ఎస్ నాయకులు, హాకీ టోర్నమెంట్ అసోసియేషన్ ప్రతినిధులు, ఆటగాళ్ళు మరియు ఇతరులు పాల్గొన్నారు.