అనుమానాలు వద్దు
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
వాక్సిన్ లు మానవ కళ్యాణం కోసం అనుమానాలు వద్దు అన్ని పరీక్షల తరువాతనే వాక్సిన్ వేస్తున్నారు భయపడవద్దు, ఆ భయం పోగొట్టడానికి నేను రేపు వాక్సిన్ వేసుకుంటున్నాను.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. భారత ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వాక్సిన్ రేపు ప్రారంభంకానుంది. మన రాష్ట్రంలో 139 సెంటర్స్ ఏర్పాటు చేశాము. గాంధీ ఆసుపత్రిలో నేను, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, DME రమేష్ రెడ్డి గాంధీ ఆసుపత్రిలో పాల్గొంటున్నాం. రాష్ట్రం లో మిగతా కేంద్రాల్లో స్థానికంగా ఉన్న ఎంపీలు,ఎమ్మెల్యేలు పాల్గొంటారు. మొదటి డోసు వేసుకున్న 28 రోజుల తరువాత రెండవ డోసు తప్పనిసరిగా వేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డోసులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సిబ్బందికి సరిపోతాయి, మరిన్ని డోసులు అందిన తర్వాత ప్రైవేట్ ఆస్పత్రులకు.. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం కోమార్బిడిటీస్ ఉన్న వారికి, 50 సంవత్సరాల పైబడిన వారికి వాక్సిన్ ఇస్తాము. వ్యాక్సిన్ పనిచేస్తుందా? లేదా? అనే ఆందోళన వద్దు. వాక్సిన్ మానవ కళ్యాణం కోసం. భయపడవద్దు. శాస్త్ర బద్దంగా అన్ని పరీక్షల తరువాతనే DCGI వాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత్ బయోటెక్ వాక్సిన్ 3 వ రౌండ్ ట్రైల్స్ నిమ్స్ లో నడుస్తున్నాయి. అవి పూర్తి కాగానే అందుబాటులోకి వస్తుంది. మొత్తం 1213 కేంద్రాలు సిద్దం చేశాము. వాక్సిన్ వేసిన తరువాత అరగంట పాటు పరిశీలనలో ఉండాలి. అందుకు అవసరం అయిన అన్ని ఏర్పాట్లు చేసాము. రియాక్షన్స్ వచ్చే అవకాశాలు తక్కువ, ఒక వేళ వచ్చిన వారికి అత్యవసర వైద్య చికిత్స అందించడం కోసం 57 సెంటర్స్ సిద్దం చేశాము. ఈ శాఖకు కెప్టెన్ ను, సిబ్బందిలో ప్రజల్లో ఆత్మవిశ్వాసం కోసం మొదటి టీకా నేనే వేయించుకోబోతున్నాను. కోట్ల మందికి ప్రాణదానం చేసిన పెన్సిలిన్ సైతం ముందుగా పరీక్ష చేసిన తరువాతనే ఇస్తారు. కాబట్టి భయపడవద్దు. కరోనా ను రాష్ట్రం నుండి తరిమికొట్టడానికి అందరూ సహకరించాలి.