Print Friendly, PDF & Email

రామ మందిర నిర్మాణానికి VG ఫౌండేషన్ కృషి

0 6

ప్రతి హిందువు కల అయోధ్యలోని రామమందిర నిర్మాణం.. ఊరువాడా రాముడి గుడి ఉన్నా ఆయన జన్మించిన అయోధ్యలో మాత్రం అయన గుడి కరువైంది. ఎన్నో సంవత్సరాల భారతీయుల కల త్వరలో నెరవేరబోతోంది. రామ మందిరంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలనే సంకల్పంతో మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని రామ జన్మభూమి ట్రస్ట్‌, విశ్వ హిందూ పరిషత్‌ శుక్రవారం ప్రారంభించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రామ మందిర నిర్మాణం కోసం VG ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమ వంతు భద్యతగా విరాళాలు సేకరిస్తున్నారు. ఈ సందర్బంగా VG అధ్యక్షులు బోగా విజయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ. రామ మందిర నిర్మాణం కోసం తమ వంతు బాధ్యతగా విరాళాలు సేకరిస్తున్నాము, విరాళాల సేకరణ పూర్తవగానే మొత్తం విరాళము గా స్వీకరించిన సొమ్మును ట్రస్ట్ వారికీ అందజేస్తాము అని తెలియజేశారు.ఇలాంటి అవకాశం మాకు దొరకడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని తెలియజేశారు.

 

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents