రాజేందరన్న ..ఏమిచ్చి మీ రుణం తీర్చికోగలం.
ఆపద వస్తే తొడబుట్టిన వారే పట్టించుకోరు. కాని నేనున్నానంటావు. బాధలు వింటావు, నీ బాధే అనుకుంటావు, అక్కున చేర్చు కుంటావు ఆదుకుంటావు. అభాగ్యులకు అన్నగా అండగా వుంటావు, వారి కష్టాలుతీర్చే, కన్నీరు తుడిసే నేస్తానీవైతవు, ఆపద, అవసరం అన్ని నీవై మాలో భరోసా నింపావు, నీకు ఇంత గొప్ప మనసును, సీవా గుణాన్ని అందించిన ఆ దేవుడికి, నిన్ను కన్న తల్లిదండ్రులకు, నీవు జన్మించిన కమలాపూర్ గడ్డ రుణం మేమెలా తీర్చుకోగలం అన్న. నీ గొప్ప మనసుకు మేమంతా శిరస్సు వంచి మనఃపూర్వకంగా నమస్కరించడం తప్ప. మాటలు ఆకలి తీర్చవు అని చేతల్లో చేసి చూపినావ్ , అన్ని వర్గాలు నాయేనని బాధల్లో తోడుంటావు, అందరి బాధలు ఒకటే నంటావు, ఆపదలో రాజకీయాలు వద్దంటావు, ఆపదలో పార్టీల ఊసు ఎత్తవద్దంటావు. ఆపద ముఖ్యం తప్ప పార్టీలు కాదంటావు. ఇదే స్ఫూర్తిని మాలో నింపావు మాకు ఆదర్శమైనావు. నీవు నాడు అడుగుపెట్టిన( రాజకీయ అరంగ్రేటం) నాటి కమలాపూర్ నుండి నేటి హుజురాబాద్ నియోజకవర్గం రూపు రేఖలు మార్చి అభివృద్ధి అంటే ఇది అని నిరూపించి నియోజక వర్గాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ గా నిలిపావు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడ లాడించే వేళ నీవు చూపిన తెగువ అద్భుతం అమోఘం. కరోనా రోగుల వద్దకు వెళ్లి వారిలో మనోధైర్యాన్ని నింపి మాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చావు. ఆస్పత్రులన్ని కలియతిరిగి వైద్య రంగాన్ని ఉరకలు పెట్టించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టావు. వైద్య ఆరోగ్య శాఖకు కెప్టెన్ గా నిలిచావు. చేసే పనిలో నిబద్దత,అంకిత భావం, తపన, ఆరాటం, కసి వుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని ఆరోగ్య శాఖ మంత్రిగా నిరూపించావు. గడిచిన 10 నెలలుగా మాకు, రాష్ట్ర ప్రజలకు పెద్దన్న వయ్యావు. ఎలాంటి రోగమొచ్చినా,కరోనా వచ్చినా క్యాన్సర్ వచ్చినా నీవున్నావనే మొండి ధైర్యం మాలో పెరిగిందయ్యా. ఇప్పటికే నీ తెగువకు తెలంగాణ యావత్తు సలాం చేస్తుంటే తొలి కరోనా వ్యాక్సిన్ నేనే తీసుకుంటాను అన్న ఆ ఒక్క పదం చాలయ్యా మాలో వెయ్యేనుగుల బలం వచ్చింది. దేశంలో ఏ రాజకీయ నాయకుడు, ఏ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తీసుకోని సాహసోపేత నిర్ణయం తీసుకున్న నీకు తెలంగాణ సమాజం చేతులెత్తి మొక్కుతుందయ్యా. ఈటల రాజేందర్ అంటే ప్రజల గుండెల్లో భరోసా అనే చప్పుడే వినిపిస్తుందన్నా. ఇంత చేసిన, చేస్తున్న నీకు మేము ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు, ఉన్నంత కాలం నీ అడుగుజాడల్లో నడవడం తప్ప..