Print Friendly, PDF & Email

 ఓ విలేఖరి నీకెంత కష్టం

మనుగడకోసమే... జర్నలిస్టుల సంఘాలు

జర్నలిస్టుల సంఘాలు, మండల విలేఖర్ల గురించి ఏప్పుడైనా ఆలోచించార సార్..యాడ్ వేసిన వారు డబ్బులు ఇవ్వక పోయినా పనిచేస్తున్న విలేఖర్లు మాత్రం అప్పులు చేసి డబ్బులు చెల్లించాలి.. ఎన్ని సంవత్సరాలు పనిచేసిన ఎవరైనా కాని వచ్చి ఆరోపణలు చేస్తే ఎలాంటి ఎంక్వయిరీ లేకుండా తీసి ప్రక్కన పెడతారు..ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా..వేలాది రూపాయలు జీతాలు వస్తున్న వారు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్రతకడం భారమైంది కానీ ఎలాంటి జీతభత్యాలు లేకుండా సంవత్సరాలు తరబడి జర్నలిస్టులు పనిచేస్తున్నారు.. ఎన్నాళ్లు ఇలా అరకొర వేతనాలు చెల్లించాలని మన యాజమాన్యం మీద ప్రభుత్వం పైనా ఎందుకు ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేయాలన్న ఆలోచన జర్నలిస్టుల సంఘాలకు రావడంలేదు.. ఎవరు కష్టాలు పడుతున్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వార్తలు ద్వారా అధికారులు దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నాం .. మరీ మన కష్టాలు తీర్చే వారు ఎవరూ? రాజకీయ నాయకులు, సినీ హీరో లు ప్రభుత్వ అధికారులు ఇలా ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిని పెంచుకొని ప్రజల్లో గుర్తిండి పోవాలంటే మీడియా సహకారం కావాలి.. జర్నలిస్టుల బాగోగులు పట్టించుకునే వారు కరువయ్యారు.. అసలు జర్నలిస్టులకు భద్రత ఎక్కడ చెప్పండి సార్…. నిజాలు వ్రాస్తే ఎంతో మంది శత్రువులు, వారి వలన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా లోబడి పనిచేయడం తప్ప చేసేది ఏమి లేదు.. మరీ జర్నలిస్టుల సంఘాలు విలేఖర్ల భద్రత పై ఇంతవరకు ఎలాంటి పోరాటాలు చేశాయి.. వారి ఉద్యమాలతో ప్రభుత్వాలు దిగి వచ్చి విలేఖర్ల కు ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు.. మండల స్థాయి లోని జర్నలిస్టులకు అధికారులు దగ్గర తగిన గౌరవం లేదంటే చెప్పుకోవడానికి సిగ్గు చేటు .

మనకు గౌరవం ఎక్కడుతుంది ఇదే కాకుండా ఇలా ప్రతి మండలంలో పనిచేస్తున్న విలేకరులందరు ఏదో ఒక రూపంలో అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాటికి మార్గాలు ఎలా అని సంఘాలు ఎప్పుడైనా ఆలోచించార. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు చిన్న, పేపరు, పెద్ద పేపరు అంటూ వివక్ష చూపుతూ పేపర్లను మనమే కించపరుసుకుంటూ ఇతరులకు చులకనగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాం. ఇలాంటి వాటికి శాశ్వత పరిష్కారం కోసం ఎప్పుడై జర్నలిస్టుల సంఘాలు ఆలోచించాయా.. ఈ పరిష్కారం కోసం మార్గాలు లేవా.. అధికారులు దగ్గరి వార్తలు కోసం వెళ్లినప్పుడు పేపర్ ను బట్టి విలువ ఇస్తూ సమాచారం అందిస్తున్నారు. ఇంతమంది విలేఖర్లా అంటూ అవహేళన చేస్తున్నారు. మరీ అధికారులకు మాత్రం క్రింది స్థాయి వరకు ఎంతమంది అయినా ఉండవచ్చు. వారి గురించి గొప్పలు చెప్పి అనుగుణంగా వార్తలు వ్రాస్తే ఎంత మంది అయినా ఉండవచ్చు. అవినీతి ఆరోపణలతో వార్తలు వ్రాస్తే ఇంత మంది ఉన్నారు అంటున్నారు. ఇలాంటి వాటికి పుల్ స్టాప్ ఎలాపెట్టాలని సంఘాలు ఆలోచించడము లేద.. ప్రతి ఉద్యోగి తమ జీతాలు కోసం వారి మనోభావాలు కోసం పోరాటాలు చేస్తూ మనోభావాలను కాపాడుకోవడమే కాకుండా ప్రభుత్వంతో పోరాడి జీతాలు పెంచుకుంటున్నాడు..24 గంటలు సమాజం కోసం పోరాడే మనం మాత్రం మన భవిష్యత్తు కోసం గాని మనోభావాలను కాపాడుకోవడం కోసము గానీ మన కుటుంబాల కోసం గానీ ఎలాంటి పోరాటాలు చేయడం లేదు..

ఇటు జర్నలిస్టుల సంఘాల నాయకులు గానీ మన పత్రికలు, మీడియా యజమానులు గాని మన సమస్యలు పై చొరవ చూపడం లేదు. ఎంతసేపు పేపర్ పబ్లిసిటీ యాడ్స్ సంవత్సరం చందాలు తప్ప ఏ పేపర్ అయినా మండలస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వారు పడుతున్న కష్టాలు అవమానాలు భద్రత పై వ్రాసిన పాపనా పోలేదు ఇక్కడ మేము అవమానించ బడుతున్న సరైన గౌరవం దక్కక పోయిన మాకు కాదు.. అవమానం పత్రికల యజమానులకే అది మరవద్దు “బడిలో పిల్లోడు చదవలేదంటే అది వానికి కాదు అవమానం చదువు చెప్పుతున్న టీచర్ కి అవమానం” అలాగే ఇది కూడా.. ప్రభుత్వం, అధికారులు, ప్రజలకు వారధిలా పనిచేస్తున్న మండల విలేఖర్లకు కనీసం ప్రభుత్వ స్థలం, గానీ ప్రభుత్వం గృహాలు గానీ ప్రభుత్వ భూమి గానీ ఇచ్చిందా, ఎప్పుడు మీటింగ్ పెట్టినా యాడ్స్ , పేపర్ పబ్లిసిటీ గురించి మాట్లాడతారు తప్ప మీకు ఇంటి స్థలం ఇచ్చార ప్రభుత్వం భూమి ఇచ్చార ప్రభుత్వ గృహం మంజూరు అయిందా మండలంలో ఎలాంటి కష్టాలు పడుతున్నారు. మీకున్న బాధలు చెప్పండి అని ఏనాడై అడిగార..లేదు..పేదల గృహ నిర్మాణం కోసం ప్రజా సంఘాలు ప్రతి రోజు పోరాటాలు చేస్తున్నాయి ఎలాంటి జీతభత్యాలు లేని మనం ఇంకా పేదవాళ్లం మరీ మన కోసం ఎప్పుడైనా పోరాటాలు చేశామా… లేదు . జర్నలిస్టుల సంఘం నాయకుల్లారా ఇప్పుడైనా కళ్లు తెరవండి..సమాజంలో మన పాత్ర ఎంత ముఖ్యమైనదో సమాజానికిజ్ తెలిజేయండీ .

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents