Print Friendly, PDF & Email

యువరాజే కాబోయే సీఎం?.. డిప్యూటీగా ఈటల?

0 9

యువరాజు కాబోయే సీఎం అవుతారని, మంత్రులు, ఎమ్మెల్యేలు కోడై కూస్తున్నారు. కేటీఆర్ కేబినెట్ లో కూడా డిప్యూటీ సీఎం పదవి ఉంటుందని, డిప్యూటీ సీఎంగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఈటెల రాజేందర్ కు వరించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఏ జిల్లా నుంచి ఏ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తారో లీడర్లు లెక్కలు తీస్తున్నారు. ప్రస్తుత మంత్రులందరికీ కేటీఆర్ కేబినెట్​లో చోటు దక్కకపోవచ్చని చెప్తున్నారు. ఇద్దరు ముగ్గురు మినహా మిగతా వారిని పక్కన పెడ్తారని, ఆ ప్లేస్​లలో అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులను కేటీఆర్​ కేబినెట్ లోకి తీసుకుంటారని అనుకుంటున్నారు.  కరీంనగర్ జిల్లా నుంచి ఒకరిని మంత్రి పదవి నుండి తప్పించడం ఖాయమని పలువురు భావిస్తున్నారు. ఆ ఒక్కరు ఎవరనేది ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సందిగ్థత కొనసాగుతోంది. కేటీఆర్ కేబినెట్ లో కల్వకుంట్ల కవితకు బెర్త్​ ఖాయమేనని అనుకుంటున్నారు. రాష్ట్ర కేబినెట్ లో సీఎంతో పాటు 17 మందిని మంత్రులుగా నియమించుకునే చాన్స్ ఉంటుంది. హరీశ్ రావు, ఈటల రాజేందర్​, కవితకు బెర్త్​లు ఖరారైతే… మిగిలిన 14 స్థానాల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై టీఆర్​ఎస్​లో పలు రకాలుగా చర్చలు నడుస్తున్నాయి. దళితుడిని సీఎం చేయాలనే డిమాండ్​ వస్తున్నందున ఒక ఎస్సీ, ఒక ఎస్టీకి, ఒక ముస్లింకు, కేబినెట్​లో చాన్స్​ ఖాయమని లీడర్లే చెప్తున్నారు. ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ తోపాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పదవులపై ధీమాతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రస్తుతం ఉన్న నలుగురు మంత్రుల్లో ఒకరికి ఉద్వాసన తప్పదని పలువురు భావిస్తున్నారు. కాబోయే సీఎం కేటీఆర్ ఈ జిల్లాకు చెందిన వారే కావడంతో, డిప్యూటీ సీఎం కూడా ఇదే జిల్లాకు చెందిన ఈటెల రాజేందర్కు దక్కే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ఉద్యమ నేతలుగా ముద్రపడ్డ హరీశ్ రావు, ఈటలకు కేటీఆర్ కేబినెట్​లో బెర్త్ ఖాయమని తెలుస్తోంది.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents