Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 85

Deprecated: Implicit conversion from float 79.9 to int loses precision in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-includes/class-wp-hook.php on line 87
అధికారంలోకి వచ్చాక ఆ ఇద్దరు పందికొక్కుల పని పడతాం: నారా లోకేశ్ – K News

అధికారంలోకి వచ్చాక ఆ ఇద్దరు పందికొక్కుల పని పడతాం: నారా లోకేశ్

ఉత్తరాంధ్రను వైసీపీకి చెందిన ఇద్దరు అక్రమార్కులు దోచుకుంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన శంఖారావం సభలో మాట్లాడుతూ.. నెత్తిన తెలుగుదేశం జెండా దింపకుండా, మడమ తిప్పకుండా, తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. కొందరు నాయకులు వచ్చారు, కొందరు పార్టీ మారారు కానీ, టీడీపీకి ఎప్పుడూ అండగా నిలబడింది మాత్రం కార్యకర్తలేనని కొనియాడారు.

రాష్ట్రంలో జగన్ పని అయిపోయిందని 31 మంది ఎంపీలను పెట్టుకొని కేంద్రం మెడలు వంచుతా అని ఆయనే లొంగిపోయాడని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని ఎమ్మెల్యేలను మార్చే కొత్త పథకం తీసుకొచ్చాడని, ఇక్కడ తరిమేసిన వాళ్లని వేరే దగ్గర తీసుకుంటారా అని ప్రశ్నించారు. సొంత కార్యకర్తతో కొడికత్తితో పొడిపించుకున్నారని, బాబాయ్ ని కూడా చంపేసి వాటిని మనపై వేశాడన్నారు. వాటిని తిప్పికొట్టాల్సిన సమయం వచ్చిందన్నాడు. అంతేగాక ఉత్తరాంధ్రను వైవీ సుబ్బారెడ్డి. విజయసాయి రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులకు అప్పగించాడని, వారిద్దరూ పంది కొక్కుల్లా దోచేసుకుంటారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎక్కడ భూమి కనిపించినా కబ్జా చేస్తున్నారని, ఎక్కడ మైన్ కనబడినా తవ్వేస్తున్నారని, మేం అధికారంలోకి వచ్చాక వారి పని పడతామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.